మంచు విష్ణు హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా `ఓటర్`. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రమా రీల్స్ బ్యానర్‌పై జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. సోమవారం మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత జాన్ సుధీర్ పూదోట తెలిపారు. సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంపత్‌రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.